Events

ఎందరో మహానుభావులు - అందరికి వందనాలు - 1

🙏🙏*ఎందరో మహానుభావులు - అందరికి వందనాలు* **1** 🙏
మన సమూహంలో ఉన్న పెద్దలు *శ్రీ మల్లిఖార్జున శర్మ గారు, శ్రీ హేమాకాంత ప్రభాకరరావు గారు శ్రీ విభీషణ శర్మ గారు శ్రీ మురళీకృష్ణ శర్మ గారు* ఇంకా మన వాట్సాప్ గ్రూప్ లో లేకపోయినా అనుక్షణం నా వెన్ను తట్టి నన్ను ప్రోత్సహించిన మా తల్లిగారు మరియు ఎన్నో ఆధ్యాత్మిక పుస్తకాల రచయిత్రి *శ్రీమతి విశాలాక్షి గారు* వంటి వారి గురించి వారి మన అందరికి చిరపరిచయమే. 
అటువంటి గొప్పవారు మన ఆకెళ్ళ వాళ్ళు కావడం ఇంకా వారు మన సమూహంలో ఉండటం మన అందరి సుకృతంగా నేను భావిస్తున్నాను.
కాకపోతే ఎంతో నిరాండంబరంగా మనలోనే ఉంటూ మన అందరికి ఆదర్శప్రాయం అవతగ్గ కొందరు గొప్ప వ్యక్తుల గురించి మన అందరికి తెలియవలసిన అవసరం ఎంతైనా ఉంది, అటువంటి గొప్ప వారిని ఉద్దేశించే నా ఈ సందేశం. నేను ఒకలొకళ్ళుగా అటువంటి గొప్ప వ్యక్తులను పరిచయం చేస్తాను.

*శ్రీమతి ఆకెళ్ళ సుబ్బలక్ష్మి గారు*

శ్రీమతి సుబ్బలక్ష్మి గారు వైజాగ్ స్వాతి ప్రోమోటర్స్ లో D G M గా పని చేస్తున్నారు. వీరు తన 28va ఏట తన భర్తని కోల్పోయారు. కానీ తన ఒంటరితనము ఇంకా పేదరికము చూసి యెంత మాత్రం అధైర్యము చెందకుండా ఎంతో శ్రమకి ఇంకా కష్టాలకు ఓర్చి తన ఇద్దరు పిల్లలను చదివించి ప్రయోజకులుగా చెయ్యడమే కాకుండా తండ్రి లేని పేద పిల్లల పరిస్థితి అర్ధం చేసుకున్న వారిగా ఒక 20 మంది పిల్లలను దత్తత తీసుకుని తన స్వంత ఖర్చులతో విద్యాబుద్దులు నేర్పించి వాళ్లకు ఉన్నత చదువులు చదివించి వాళ్ళను కూడా ప్రయోజకులుగా తీర్చి దిద్దారు. 
వీరు 2000 సంవత్సరంలో వైజాగ్ శ్రీనివాస నగర్ లో సాయి భారతి పబ్లిక్ స్కూల్ ( recognised ) స్థాపించి అతి తక్కువ ఫీజులతో నడిపించి 450 విద్యార్థుల స్ట్రెంగ్త్ కల పాఠశాలగా అభివృద్ధి చేసారు. ప్రస్తుతం ఆ పాఠశాలా వారి సోదరి నడుపుతున్నారు. కష్టే ఫలి అనే సామెతకు ప్రతీకగా నిలవడమే కాకుండా పరులకు సహాయం చేయడానికి కావాల్సింది డబ్బు కాదు గొప్ప మనస్సు అని ఆవిడ నిరూపించారు
శ్రీమతి సుబ్బలక్ష్మి గారు మన ఆకెళ్ళ ఫౌండేషన్ లో లైఫ్ మెంబర్ గా చేరడమే కాకుండా మన అమలాపురం కార్యక్రమానికి 2000 తనవంతు సహకారంగా అందించారు 
అటువంటి గొప్ప వ్యక్తి నన్ను అన్నయ్యగా పిలవడం నేను చేసుకున్న అదృష్టంగా భావిస్తున్నాను

రవి కుమార్ ఆకెళ్ళ

Copyrights © 2018 All Rights Reserved. Powered by PRAVDAKSHAYA.