Events

ఎందరో మహానుభావులు అందరికి వందనాలు - 2

🙏🙏 *ఎందరో* *మహానుభావులు అందరికి వందనాలు* - *2* 🙏🙏

జనవరి 21 మన ద్వితీయ సమ్మేళనం అని తెలియగానే శ్రీ హేమకాంత ప్రభాకర రావు గారు శ్రీ పేరిశివ కుమార్ గారు శ్రీమతి సుబ్బలక్ష్మి అడ్వకేట్ గారు శ్రీమతి సుబ్బలక్ష్మి గారు ( వైజాగ్) శ్రీమతి గీతాంజలి ( నా సతీమణి ) వారంతా ఇతోధికంగా కొంత కొంత విరాళంగా ఇచ్చారు. ఇంకా శ్రీ మురళీకృష్ణ శర్మ గారు మరియు శ్రీ రాజబాబు గారు కార్యక్రమము రోజున వారి వారి విరాళము ఇచ్చారు.
కాకపోతే మన కార్యక్రమము యొక్క ఖర్చు భారీగా ఉంటుందని ముందుగానే ఊహించి ఒక అంచనాకు వచ్చి మన కార్యక్రమం విజయవంతం చేయటానికి మన అందరికంటే ఎన్నో రెట్లు ఎక్కువగా శ్రమించి ఎంతగానో తోడ్పడ్డారు మన ఆకెళ్ళ వారి ఆడపడుచు శ్రీమతి లక్ష్మి కామేశ్వరి గారు మరియు వారి భర్త శ్రీ తెన్నేటి రవి కుమార్ గారు. వీరి నివాసం దుబాయ్....శ్రీమతి లక్ష్మి కామేశ్వరి గారు నాకు శ్రీనివాస శర్మ గారిని శ్రీ లక్ష్మి ప్రసాద్ గారిని ఇంకా శ్రీ తాళ్ళపాక సందీప్ గారిని పరిచయం చేసారు. 
శ్రీనివాస శర్మ గారి ద్వారా మనకు శ్రీ V S N L సుబ్బారావు గారు వారి శ్రీమతి జ్యోతి గారు పరిచయం అయ్యారు. వాళ్ళ పాప చిరంజీవి శ్రావణి. ఆ పాప తన అద్భుతమైన నృత్యంతో మన అందరిని ఎంతగా అలరించారో మీ అందరికి తెలిసిందే. ఆ చిరంజీవి ఇంతకూ ముందే ఎన్నో ప్రదర్శనలు ఇచ్చి ఉంది. రవీంద్ర భారతిలో ప్రదర్శన ఇచ్చినప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభత్వం నాట్య మయూరి అని బిరుదు ఇచ్చి సత్కరించింది. అలాగే శ్రీనివాస శర్మ గారు మరి కొన్ని అద్భుత నృత్య కార్యక్రమాలు మనకి అంద చేసారు. వారు కూడా దత్త చరిత్ర బృంద నృత్యంతో మన అందరిని అలరించారు. 
శ్రీ సుబ్బారావు గారు మనం చేస్తున్న కార్యక్రమాలు గురించి తెలుసుకుని మనకి 25000/- రూపాయిలు విరాళంగా ఇచ్చారు ..శ్రీ సందీప్ గారు మన ఫౌండేషన్ డైరీస్ ప్రింటింగ్ లో కొంత సహాయం చేసారు. అలాగే శ్రీ లక్ష్మి ప్రసాద్ గారు 5000/- విరాళంగా ఇవ్వడమే కాకుండా భవిషత్తులో మనం చేసే అన్ని కార్యక్రమాలకు తన మద్దతు ఉంటుందని సభా ముఖంగా ప్రకటించారు 
శ్రీ రవి కుమార్ గారు అనునిత్యం తరచుగా నాతొ ఫోన్ లో మాట్లాడుతూ నాకు ఎంతో ధైర్యం ఇచ్చారు అలాగే కామేశ్వరి గారు పైన చెప్పిన వాళ్ళను నాకు పరిచయం చెయ్యడమే కాకుండా వాళ్ల అందరితో తరచుగా ఫోన్లో మాట్లాడుతూ మన కార్యక్రమం విజయవంతం కావడానికి అన్ని విధాలా కృషి చేసారు. వాళ్ళు చేసిన ఫోన్ కాల్స్ ఖర్చుతో బహుశా ఒక వ్యక్తికి దుబాయ్ నుండి ఇండియా రావడానికి ఎయిర్ టికెట్ వస్తుందేమో అని నేను చెప్తే అది అతిశయోక్తి కాదు . శ్రీమతి కామేశ్వరి గారు మన ఆకెళ్ళ ఆడపడుచు వివాహం జరిగింది.. ఒక పాప. చక్కటి అన్యోనమైన ఇంకా ఆనందమైన సంసారం.. ఎటువంటి బాదరబందీ లేకుండా తన కాపురం తాను చేసుకుంటూ ఉండచ్చు కానీ వారికీ తనకు జన్మనిచ్చిన్న వంశం ఆకెళ్ళ మీద ఉన్న అభిమానంతో ఎంతో శ్రమకోర్చిమనకు సహాయం చేసారు అలాగే ఆవిడ భర్త శ్రీ రవికుమార్ గారు కూడా భార్య మనస్సు తెలుసుకున్నవాడై తనకు అన్ని విధాలా అండగా నిలిచారు ఆ దంపతుల కృషి నిజంగా అద్వితీయమైనది వారి కృషి గురించి మనం యెంత చెప్పుకున్న తక్కువే.. వారికి నా ప్రణామాలు...

రవి కుమార్ ఆకెళ్ళ

Copyrights © 2018 All Rights Reserved. Powered by PRAVDAKSHAYA.