Events

ఎందరో మహానుభావులు -అందరికి వందనాలు- ౩

🙏🙏 *ఎందరో* *మహానుభావులు -అందరికి వందనాలు* - *౩*🙏🙏

జనవరి 21 మన సమ్మేళనం నిశ్చయం అయ్యాక మొదటిసారిగా నేను శ్రీమతి గీతాంజలి, రామ్ ఇంకా నా ఇద్దరు మిత్రులు నమడూరి కృష్ణారావు మరియు శ్రీ దేవరకొండ రమా భాస్కర్ మొదటిసారిగా అమలాపురం ముక్కోటి ఏకాదశి అనగా డిసెంబర్ 27 నాడు వెళ్ళాము. అక్కడ గ్రాండ్ పార్క్ హోటల్ లో రెండు గదులు తీసుకొని బస చేసాము. హోటల్ ఒక మోస్తరుగా పర్వాలేదు అనిపించేలా ఉంది అక్కడ గదికి రోజు అద్దె 1600/- ఒక్క పూర్తి రోజు ఉన్నాము అంటే 3200/- అద్దె కట్టాల్సి వచ్చింది 
ఆతర్వాత మల్లి జనవరి 13-14 తేదీలలో శ్రీమతి గీతాంజలి ఇంకా శ్రీమతి సుబ్బలక్ష్మి (అడ్వకేట్) అమలాపురం ఇంకా ఆ చుట్టుపక్కల ఊళ్ళకి వెళ్లి మన కార్యక్రమం గురించి వీలైనంత మందికి తెలియచేయడం జరిగింది. అప్పుడు పరిచయం అయ్యారు *శ్రీ ఆకెళ్ళ రాంబాబు గారు వారి అబ్బాయి చిరంజీవి ఫణీశ్వరనాధ్ ఇంకా రాంబాబు గారి సోదరుడు ఆకెళ్ళ విఠల్ గారు. రాంబాబు గారు లైబ్రేరియన్ గ పని చేసి రిటైర్ అయ్యారు వారి సతీమణి శ్రీమతి లక్ష్మి గారు .. విఠల్ గారు లెక్చరర్ గా పని చేసి రిటైర్ అయ్యారు వారి సతీమణి శ్రీమతి విజయలక్ష్మి గారు*. ఫణి మన సమూహంలో ఉన్నాడు. మన మొదటి సమ్మేళనం కి కూడా విచ్చేశాడు కాకపోతే పెద్దగా పరిచయం కాలేదు. ఆ తర్వాత జనవరి 17 వ తారీఖు నుండి సోదరుడు *రామ్* విస్తృతంగా అమలాపురం,ఇంకా ఆ మిగిలిన ఆ చుట్టుపక్కల ఊళ్లు పర్యటించి మన కార్యక్రమం విజయవంతం కావడానికి తనవంతు కృషి చేసాడు.

మేము 14 మందిమి మన కార్యక్రమమునకు హైదరాబాద్ నుండి జనవరి 19 న 3 కార్లలో బయలుదేరాము. ఇప్పుడు సమస్య ఇంతమందిమి ఇన్ని రోజులు ఎక్కడ ఉండాలి అనేది.. హోటల్లో ఉంటె ఇంకో 20000/- ఆర్ధిక భారం తప్పదు 
దుబాయ్ లో ఉండే సోదరుడు *ఆకెళ్ళ రామ సోమయాజులు గారు* ఇరుసుమండ వాళ్ళ ఇంటిలో ఒక 20 మంది దాకా ఉండచ్చు అని తెలిపి అక్కడే బస చెయ్యమని అభ్యర్ధించారు. కాకపోతే అమలాపురం నుండి ఇరుసుమండకి ఒక 20 - 25 నిమిషాల ప్రయాణం ఇంకా సోమయాజులు గారి మాతృమూర్తి *శ్రీమతి సుబ్బలక్ష్మి గారు* చేతి గాయంతో కొంచెం ఇబ్బంది పడుతున్నారు, అందువల్ల ఇరుసుమండ వద్దనుకున్నాము. అప్పుడు *రామ్* పెద్ద మనస్సుతో అమలాపురం వాళ్ళ ఫ్లాట్ లో బస చెయ్యమని చెప్పడమే కాకుండా మేమంతా ఉండటానికి బెడ్స్ తెప్పించి మిగిలిన అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసాడు. మార్గ మాధ్యమంలో శ్రీమతి గీతాంజలి... ఫణికి మేము బయలుదేరిన విషయం ఫోన్ ద్వారా తెలియచేసింది. సుమారుగా 7.0 గంటల సమయంలో మేము ఊహించని ఫోన్ కాల్ శ్రీ *రాంబాబు* గారి దెగ్గరనుండి *గీతాంజలి* ఫోన్కు, మేమంతా వారి ఇంట్లోనే భోజనం చేసి వాళ్ళ ఇంట్లోనే బస చెయ్యాలని మేము వారికీ చెప్పాము మేము 14 మందిమి ఉన్నామని ఇంకా మేము వచ్చేసరికి ఆలస్యం అవుతుందని కానీ *రాంబాబు గారు* ఏది ఏమైనా రావాల్సిందే అని పట్టుబట్టారు, సరే అని మేమంతా ఆరోజు రాత్రి 11.30 వారి ఇంటికి చేరుకున్నాము. వేడి వేడి భోజనం ఇంకా టిఫిన్స్ తింటా అన్నవాళ్ళకి టిఫిన్స్ ఏర్పాటు చేసారు. భోజనాలు ముగించుకుని ఆ రాత్రికి ఆడవాళ్ళంతా *రాంబాబు గారి* ఇంట్లో ఇంకా మగ వాళ్ళు అంతా *రామ్* ఫ్లాట్ లో బస చేసాము. మర్నాడు పొద్దున్న అల్పాహారం మధ్యన భోజనాలు ఇంకా రాత్రి భోజనాలు అన్ని వాళ్ళ ఇంట్లోనే. ఆ రాత్రికి మగవాళ్ళం అంతా శ్రీ విఠల్ గారి ఇంట్లో మేడ పైన ఆడవాళ్ళంతా యధావిధిగా రాంబాబు గారి ఇంట్లో బస చేసాము. ఇక్కడ *విఠల్* గారి గురించి ఒక్క విషయం చెప్పుకోవాలి ..మేము పడుకునేసరికి రాత్రి 12.0 అయ్యింది ఆయన కూడా కిందకి పడుకోవడానికి వెళ్లిపోయారు ఒక అర్ధ గంట తర్వాత ఆయనకీ ఆలోచన వచ్చింది.. ఒక రాత్రి వేళ కరెంటు పొతే మేమెవ్వరమైన లేచి వాష్ రూమ్ కి వెళ్లాల్సి వస్తే ఇబ్బంది పడతామని మళ్ళి పైకి వచ్చి టార్చ్ లైట్ తెచ్చి మాకు ఇచ్చి వెళ్లారు. నాకెందుకో ఆ సంఘటన బాగా మనస్సుకి హత్తుకుంది అతిధి దేవో భవ అనే మాటను ఆయన మనసా వాచా కర్మ నమ్మి పాటించారు. ఆలా మేము అమలాపురం లో ఉన్న మూడు రోజులు గడిచి పోయాయి.
ఆ ఇద్దరు ఇల్లాళ్లు కూడా భర్తకు తగ్గ భార్యలే మాకు ఆతిధ్యం ఇవ్వడంలో ఎవ్వరు కూడా తీసిపోలేదు,, మాకు ఒక కొత్త ఇంట్లో ఉన్నామనే భావన కూడా మనస్సులోకి రానియ్యలేదు బహుశా ఇంత గొప్పగా ఆతిధ్యం ఇవ్వడం ఇంకా ఇంత చక్కటి ప్రేమాభిమానాలు పంచడం మన ఆకెళ్ళ వాళ్ళకే అందునా *రాంబాబు గారికి ఇంకా విఠల్ గార్లకే* సాధ్యం అవుతుందేమో.....

*రవి కుమార్ ఆకెళ్ళ*

Copyrights © 2018 All Rights Reserved. Powered by PRAVDAKSHAYA.