Events

ఆకెళ్ళ ఫౌండేషన్ ద్వారా వివాహాలు సహాయం

ఈ పైన శుభ లేఖలో పేర్కొన్న  వైష్ణవి ఒక పేద బ్రాహ్మణ కుటుంబంలో  పుట్టింది. ఆ అమ్మాయికి తల్లిదండ్రులు లేరు. ఆ పిల్ల మేనమామ మరియు మన ఆకెళ్ళ ఫౌండేషన్ సభ్యులు  శ్రీ రామకృష్ణ గారు ఇంకా శ్రీ వీరభద్ర శాస్ర్తీ గారు బాధ్యత తీసుకొని వివాహం జరిపించడానికి  ముందుకు వచ్చి  01 -05 -2018  నాటికీ  ముహూర్తం నిశ్చయించుకుని మన ఫౌండేషన్  సభ్యులను ఆర్థికపరమైన లేదా మరి ఏ ఇతరమైన సహాయం అర్ధించారు 

 అలాగే  హైదరాబాద్ జీడిమెట్ల వాస్తవ్యులు ,మరియు మన ఆకెళ్ళ ఫౌండేషన్ సభ్యురాలు  అయిన  ఆకెళ్ళ లక్ష్మీ గారు వారి వివాహం 09-05-2018 నాడు జరుపుటకు నిశ్చయం అయినది అని తెలియచేసి మన ఆకెళ్ళ ఫౌండేషన్ ద్వారా ఆర్థిక పరమైన సహాయం అర్ధించడం జరిగింది..
సమాచారాన్ని ఇతర సభ్యులకు తెలియచేయుటకు వారిని  వివాహ శుభలేఖ పంపమని కోరగా ఆర్థికపరమైన ఇబ్బందులు కారణంగా ఇంకా శుభలేఖ ముద్రించలేదని తెలియచేసి వ్రాతపూర్వక పత్రిక పంపించారు.

ఒకేసారి  రెండు వివాహాలు సహాయం అర్ధిస్తూ మన ముందుకు వచ్చాయి.. ఆకెళ్ళ ఫౌండేషన్ కొత్తగా స్థాపించబడింది , సంపూర్ణ ఆర్ధిక పరిపుష్టి ఇంకా చేకూరలేదు కానీ  మన ఫౌండేషన్ సభ్యులు  పెద్ద మనస్సుతో వధువులను ఆశీర్వదిస్తూ అవసరమైన ఆర్ధిక సహాయం అందించారు..అలాగే మరియొక సభ్యురాలు పుస్తెలు అందించారు..
వారందరికీ మా  🙏🙏🙏 మరియు హృదయపూర్వక  ధన్యవాదాలు..

శ్రీ వీరభధ్ర శాస్ర్తీ గారికి వారు తలపెట్టిన వివాహ నిమిత్తం మన ఆకెళ్ళ ఫౌండేషన్ ద్వారా వసూలు చేసిన మొత్తం రూపాయలు 18000/- చెక్కు ద్వారా అందచేస్తున్న ఆకెళ్ళ ఫౌండేషన్ ట్రెజరర్ శ్రీ ఆకెళ్ళ రామ్ గారిని ...శ్రీ లక్ష్మి గారి వివాహ నిమిత్తం 11116 /- చెక్కుని అందిస్తున్న శ్రీ పెరి శివకుమార్ గారిని చిత్రాల్లో గమనించవచ్చు 

ఒక మంచి కార్యక్రమానికి సహాయం చేయడంలో మన ఆకెళ్ళ ఫౌండేషన్  సభ్యులు ముందు ఉంటారు అన్నమా  నమ్మకం వమ్ము కాలేదు..

Copyrights © 2018 All Rights Reserved. Powered by PRAVDAKSHAYA.