Raja Poshak

raja

శ్రీమతి లక్ష్మి కామేశ్వరి గారు మరియు శ్రీ తెన్నేటి రవి కుమార్

శ్రీమతి లక్ష్మి కామేశ్వరి గారు మరియు శ్రీ తెన్నేటి రవి కుమార్ దంపతులు మన ఫౌండేషన్ కు రూలు 25000/- విరాళంగా ఇచ్చారని తెలియ చేయుటకు సంతోషిస్తున్నాము.
వారి గురించి కొన్ని వివరములు..
శ్రీమతి లక్ష్మి కామేశ్వరి గారు న్విరోదికృత్ సంవత్సర వినాయక చవితి రోజున ఆకెళ్ళ సత్యనారాయణ మూర్తి సుబ్బలక్ష్మి దంపతులకు జన్మించారు. వారి స్వగ్రామం ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లాలోని ఇరుసుమండ.. వారు తన 20 వ యేట శ్రీ తెన్నేటి రవి కుమార్ గారిని వివాహం చేసుకుని తెన్నేటి వారి ఇంట కోడలిగా వైవాహిక జీవితం ఆరంభించారు.ఆమె భర్త civil engineer గా దుబాయి లో పనిచేస్తున్నారు. 2002 లో దుబాయి కి వచ్చి అన్ని తెలుగు సంఘాలలో Active member గా చురుకుగా పాల్గొంటూ అకెళ్ళ వారి ఆడబడచుగానే కాకుండా దుబాయి ఆడపడుచుగా మన సంప్రదాయాలను పాటిస్తూ TRADITIONAL WOMAN OF DUBAI గా TITLE సంపాదించి తన కుమార్తెకు కూడా సాంప్రదాయలను నేర్పిస్తూ కూచిపూడి నాట్యకళాకారిణి గా తీర్చిదిద్దుతూ Proud Mother గా పేరు తెచ్చుకుని, దుబాయి లో ఉన్న పిల్లలకు దైవ స్తొత్రాలను ఉచితం గా చెప్తూ, సంగీత పాఠాలను నేర్పిస్తూ వచ్చిన డబ్బును సొంతానికి వాడుకోకుండా తన భర్త రవి కుమార్ సహకారంతో సామాజిక కార్యక్రమాలకు అనగా దుబాయి జైళ్ళల్లొ మగ్గుతున్న తెలుగు వారిని విడిపించదానికి, ప్రమాదాల్లొ మరణించిన వారిని వారి ప్రదేశాలకు పంపడానికి, ఇండియా లో మూగ చెవిటి విధ్యార్త్దులకు అనాధలకు సాయపడుతూ ఉన్నారు. గత 15 సంవత్సరాలుగా ఇలాంటి మంచిపనులను ఇతరులకు సాయం చేస్తున్న లక్ష్మీ కామేశ్వరి గారికి ఇంకా ఎన్నో అవకాశాలను ఆ లలిత అమ్మవారు కలిగించాలని ఆకాంక్షిస్తున్నాము...

Copyrights © 2018 All Rights Reserved. Powered by PRAVDAKSHAYA.

<